'కాంతార' ప్రీక్వెల్ లో యువరాణి ప్రేమకథ .. దూసుకుపోతున్న ట్రైలర్!
- 'కాంతార' ప్రీక్వెల్ రెడీ
- వివిధ భాషల్లో 7 వేల స్క్రీన్లలో రిలీజ్
- పాన్ ఇండియా రిలీజ్ డేట్ అక్టోబర్ 2
- కీలక పాత్రల్లో గుల్షన్ దేవయ్య - రుక్మిణి వసంత్
- అంచనాలు పెంచుతున్న ట్రైలర్
ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ .. ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో వదిలిన ట్రైలర్ కి అన్ని వైపుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ చేసిన అన్ని భాషల్లో కలుపుకుని, 24 గంటల్లోనే ఈ ట్రైలర్ 107 మిలియన్ డిజిటల్ వ్యూస్ ను రాబట్టడం ఒక రికార్డ్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో వెయిట్ చేస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
గతంలో వచ్చిన 'కాంతార'లో, అడవిలో కథానాయకుడి వేట .. కథానాయికతో ప్రేమ .. అక్కడి 'పంజుర్లి' సంప్రదాయం .. గ్రామీణ స్థాయి విలనిజాన్ని గురించి చూపిస్తూ వెళ్లారు. అయితే ఈ సారి కథను రిషభ్ శెట్టి మరింత విస్తృతంగా రాసుకున్నాడు. 'కాంతార' అడవి పట్ల విశ్వాసం లేని రాజు .. అక్కడికి వ్యాపారం నిమిత్తం వెళ్లిన కాంతార గ్రామస్తులు .. యువరాణిని చూసి కథానాయకుడు మనసు పారేసుకోవడం .. ఆ విషయం తెలిసిన రాజు, వంశానికి అంటిన కళంకాన్ని కాంతార వాళ్ల రక్తంతో కడిగేయాలని నిర్ణయించుకోవడం వంటి ఉత్కంఠను రేకెత్తించే అంశాలు ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.