సక్సెస్ లేకపోతే ఎవరూ పట్టించుకోరు: నటుడు విజయ్ బాబు
- నటుడిగా విజయ్ బాబుకి మంచిపేరు
- చాలాకాలంగా సీరియల్స్ తో బిజీ
- సినిమాల్లో నిలదొక్కుకోవడం కష్టమని వెల్లడి
- సక్సెస్ కి మాత్రమే విలువ ఉంటుందని వివరణ
మనకి సంబంధించిన చాలా పనులు మన చేతిలో ఉంటాయి. కానీ సినిమా అలా కాదు. నేను ఎంత బాగా చేసినప్పటికీ, దానిని బాగా తీసే దర్శకుడు కావాలి .. ప్రమోషన్స్ బాగా చేసే నిర్మాత ఉండాలి. భారీ స్థాయిలో రిలీజ్ చేయగలగాలి .. రిలీజ్ సమయంలో వాతావరణం అనుకూలించాలి .. రిలీజ్ అయిన తరువాత అది భారీ విజయాన్ని సాధించాలి. ఇవన్నీ దాటుకుని ఒక నటుడికి క్రేజ్ రావాలంటే అందుకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని నేను నమ్ముతాను" అని అన్నారు.
"సినిమా అంతా కూడా హీరో మీదనే నడుస్తుంది. హీరోకి వరుసగా ఫ్లాప్ లు పడితే ఎవరూ పిలవరు. ఎప్పుడూ కూడా సినిమాకి విలువ ఉండదు .. మార్కెట్ కి మాత్రమే విలువ ఉంటుంది. మార్కెట్ లేకపోతే ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. ట్రీట్మెంట్ పూర్తి తేడాగా ఉంటుంది. నాకు అన్నం లేకపోయినా ఫరవాలేదు .. మర్యాద కావాలి. ఎదుటివారికి నేను గౌరవం ఇస్తాను .. అలాగే నన్ను గౌరవించాలని కోరుకుంటాను .. తప్పులేదుగా" అంటూ తన అభిప్రాయాన్ని చెప్పారు.