సమంత, రాజ్ నిడిమోరు ప్రేమాయణం? భార్య పోస్టులతో కొత్త చర్చ!
- డేటింగ్ వార్తలపై అధికారికంగా స్పందించని సమంత, రాజ్
- సమంత, రాజ్ చేయి పట్టుకున్న ఫోటోతో రూమర్లకు మరింత బలం
- రాజ్ నిడిమోరు భార్య శ్యామలి దే పరోక్ష సోషల్ మీడియా పోస్టులు
మరోవైపు, రాజ్ నిడిమోరు, శ్యామలి దేల వైవాహిక జీవితంపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నాయి. వారిద్దరూ ఇంకా కలిసే ఉన్నారా, లేక 2022లోనే విడిపోయారా అనే దానిపై స్పష్టత లేదు. కాగా, ఫిబ్రవరి 1న జరిగిన వరల్డ్ పికెల్‌బాల్ లీగ్ మ్యాచ్ సందర్భంగా సమంత, రాజ్ నిడిమోరు చేయి పట్టుకుని కనిపించిన ఫోటోలు బయటకు రావడంతో వీరి డేటింగ్ వదంతులు ఊపందుకున్నాయి. సమంత చెన్నై సూపర్ ఛాంప్స్ అనే పికెల్‌బాల్ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల 'శుభం' వేడుకల్లో కూడా రాజ్‌తో కలిసి దిగిన ఫోటోలను సమంత పంచుకున్నారు. గతంలో నటుడు నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత 2021లో విడాకులు తీసుకున్నారు.