శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్లు ఇస్తున్నాం: అల్లు అరవింద్
- సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్, దిల్ రాజు, సుకుమార్
- శ్రీతేజ్ కోలుకుంటున్నాడన్న అల్లు అరవింద్
- రూ. 2 కోట్ల చెక్కులను దిల్ రాజుకు అందించిన అల్లు అరవింద్
అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ... శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు. అల్లు అర్జున్ తరపున రూ. కోటి, 'పుష్ప-2' నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ. 50 లక్షలు ఇచ్చారని తెలిపారు. శ్రీతేజ్ ఇప్పుడు కోలుకుంటున్నాడని... ఆయనకు వెంటిలేటర్ తీసేశారని వెల్లడించారు. రూ. 2 కోట్లకు చెందిన చెక్కులను దిల్ రాజుకు అందజేశారు.