హీరో నాగార్జునపై కేసు నమోదు
- చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నాగార్జున కట్టారంటూ ఫిర్యాదు
- నాగార్జునపై కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు
- ఇటీవలే ఎన్ కన్వెన్షన్ ను కూల్చేసిన హైడ్రా
తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల భూమిని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నాగార్జున కట్టారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చేసింది. మరోవైపు, నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆమెపై నాగార్జున క్రిమినల్, పరువునష్టం కేసు వేశారు. ఈ నేపథ్యంలో, నాగార్జునపై కేసు నమోదు కావడం గమనార్హం.