Prabhas: ప్రభాస్‌ 'ది రాజాసాబ్‌' టీజర్‌పై క్లారిటీ వచ్చేసింది!

Prabhas The Rajasaab Teaser Got Clarity

  • ప్రభాస్‌ బర్త్‌డేకు 'ది రాజాసాబ్‌' టీజర్‌ లేనట్లే! 
  • సమ్‌థింగ్‌ ఇంట్రెస్టింగ్‌ కంటెంట్‌ను ప్లాన్‌ చేస్తున్న మారుతి 
  • ఏప్రిల్‌ 2025లో సినిమా విడుదల

పాన్‌ ఇండియా కథానాయకుడు ప్రభాస్‌ ఇప్పుడు వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. 'కల్కి 2898 ఏడి' తరువాత ఈ యంగ్‌ రెబల్‌స్టార్‌ మారుతి దర్శకత్వంలో 'ది రాజాసాబ్‌' అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ చిత్రం దాదాపు 50 శాతం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో నటించనున్న నూతన చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సైనికుడుగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే వర్కింగ్‌ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. 

ఇక సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్న 'స్పిరిట్‌' కూడా జనవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం. 

అయితే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 'ది రాజాసాబ్‌' చిత్రం టీజర్‌ విషయంలో గత కొన్ని రోజులుగా ఊహగానాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్‌ 23న ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

 ఇంతకు ముందే ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే టీజర్‌ విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని దర్శకుడు మారుతి సన్నిహితులు అంటున్నారు 

సో... ప్రభాస్‌ పుట్టినరోజుకు టీజర్‌ అయితే లేదు కానీ... దర్శకుడు మారుతి సమ్‌థింగ్‌ స్పెషల్‌ ప్రమోషన్‌ కంటెంట్‌ను ప్రభాస్‌ అభిమానులకు అందించాలనే ఆలోచనలో ఉన్నాడు. అయితే అది ఎలాంటి ప్రమోషనల్‌ కంటెంట్‌ అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇక ఏప్రిల్‌ 2025లో 'ది రాజా సాబ్‌' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News