సేమ్ లుక్‌లో కనిపించిన అక్కినేని హీరోలు
- ఏఎన్నార్ శతజయంతి వేడుకలో ఆకర్షణగా అక్కినేని హీరోల లుక్స్
- విలన్ పాత్ర కోసం నాగార్జున కొత్త లుక్
- తండేల్ లుక్‌లో నాగచైతన్య
ఇటీవలే ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను కొంత పార్ట్ చేశారు. త్వరలోనే మరో షెడ్యూల్ వైజాగ్‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రం పూర్తయ్యే వరకు నాగార్జున ఇదే లుక్‌లో వుంటాడు. ఇక నాగచైతన్య ప్రస్తుతం తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో తను మత్స్యకారుడుగా కనిపించబోతున్నాడు. ఇందుకోసం గత కొంతకాలంగా చైతన్య ఈ లుక్‌ను మెయింటైన్ చేస్తున్నాడు. ఈ వరుసలో అక్కినేని అఖిల్ కూడా లాంగ్‌హెయిర్, గడ్డంతో కనిపించాడు. అయితే సాధారణంగానే అఖిల్ ఎక్కువగా ఈ లుక్‌లోనే వుంటాడు. ఇలా అక్కినేని హీరోలు ఒకే లుక్‌లో కనిపించడం అందర్నీ ఆకర్షించింది. అక్కినేని శతజయంతి వేడుకల్లో ఈ హీరోల లుక్ ఓ అదనపు ఆకర్షణగా నిలిచింది.