ప్రభాస్ పై అర్షద్ వార్సీ వ్యాఖ్యలను ఖండించిన మంచు విష్ణు
- 'కల్కి'లో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడన్న అర్షద్ వార్సీ
- సినిమా అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలికి విష్ణు లేఖ
- మరోసారి అలా మాట్లాడకుండా చూసుకోవాలన్న విష్ణు
ఇకపై అలా మాట్లాడకుండా నియంత్రించాలని లేఖలో విష్ణు కోరాడు. మనమంతా యాక్టర్స్ ఫ్యామిలీకి చెందినవాళ్లమని... ఒకరి గురించి ఇలా మాట్లాడటం సరికాదని అన్నాడు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గ్లోబల్ స్టార్ ప్రభాస్ పై ఇలా కామెంట్ చేయడం తెలుగువారి మనోభావాలను దెబ్బతీసిందని చెప్పాడు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని కోరాడు.