మెల్బోర్న్ ఫెడ్ స్క్వేర్ వద్ద త్రివర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్
- మెల్బోర్న్ నగరంలో ఐఎఫ్ఎఫ్ఎం చలనచిత్రోత్సవం
- గౌరవ అతిథిగా హాజరైన రామ్ చరణ్
- ఫెడ్ స్క్వేర్ వద్ద రామ్ చరణ్ మేనియా
రామ్ చరణ్ రాకతో ఫెడ్ స్క్వేర్ వద్ద కోలాహలం మిన్నంటింది. ప్రవాస భారతీయులతో పాటు ఆస్ట్రేలియన్లు కూడా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. భారత్ మాతా కీ జై నినాదాలతో ఫెడ్ స్క్వేర్ హోరెత్తిపోయింది. రామ్ చరణ్ ప్రఖ్యాత 'ఐఎఫ్ఎఫ్ఎం' ఈవెంట్ కు గౌరవ అతిథిగా విచ్చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.