మీరు జీవితాంతం ప్రతిపక్షమే.. రాహుల్ గాంధీపై కంగన ట్వీట్
- హిండెన్ బర్గ్ ఆరోపణలకు మద్దతుగా మాట్లాడడంపై ఫైర్
- రాహుల్ ప్రమాదకరమైన వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు
- ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ.. అన్నింటినీ అస్థిరపరిచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని కంగనా చెప్పారు. భారతీయుల దేశభక్తి, జాతీయవాదం కారణంగా రాహుల్ గాంధీ ఇబ్బంది పడుతుంటారని అన్నారు. ప్రజల్లో దేశ భక్తి మరింత పెరుగుతోందని, ఇది రాహుల్ గాంధీకి మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతుందని వివరించారు. రాహుల్ ను ప్రజలు ఎప్పటికీ నాయకుడిగా ఎన్నుకోబోరని చెప్పారు. జీవిత పర్యంతం ప్రతిపక్షంలోనే కూర్చునేందుకు సిద్ధమవ్వాలంటూ రాహుల్ గాంధీకి కంగనా సూచించారు.