కంగన రనౌత్ కు వేదికపై ఝలక్ ఇచ్చిన ప్రధాని మోదీ!
- హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి బరిలోకి కంగన
- ఈ క్రమంలో ఆమె తరఫున మండిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ
- స్టేజ్‌పై ప్రధానికి గులాబీ ఇచ్చేందుకు ప్రయత్నించిన కంగన
- సున్నితంగా తిరస్కరిస్తూ చేతులెత్తి దండం పెట్టిన మోదీ
బీజేపీ ప్రచారంలో భాగంగా మండి నియోజకవర్గంలో తాజాగా ప్రధాని మోదీ పర్యటించారు. మండిలో ఏర్పాటు చేసిన సభలో కంగన రనౌత్ తరఫున ప్రసంగించారు. అంతకుముందు ప్రధానిని ఆహ్వానిస్తూ.. ఒక గులాబీ పువ్వును ఇచ్చేందుకు ఆమె ప్రయత్నించారు. తన అనుచరులు తీసుకొచ్చిన గులాబీని కంగన అందించడానికి ప్రయత్నించగా.. సున్నితంగా తిర్కరిస్తూ మోదీ చేతులెత్తి దండం పెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.