మండి లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన నటి కంగనా రనౌత్
- బీజేపీ అభ్యర్థిగా రాజకీయాల్లోకి అరంగేట్రం
- తల్లి, సోదరితో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేసిన కంగనా
- మండి ప్రజల ప్రేమే తనను సొంత రాష్ట్రానికి తీసుకువచ్చి పోటీ చేసేలా చేసిందని వ్యాఖ్య
నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, ఆమె ఏఎన్ఐతో మాట్లాడుతూ... 'ఈ రోజు నేను మండి లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశాను. మండి నుండి పోటీ చేసే అవకాశం నాకు లభించడం పట్ల గర్విస్తున్నాను. నేను బాలీవుడ్‌లో విజయం సాధించాను. ఇప్పుడు రాజకీయ రంగంలోనూ విజయం సాధిస్తాననే ఆశతో ఉన్నాను' అన్నారు.