కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫైల్ ను రేవంత్ తొక్కిపెట్టడానికి కారణం ఇదే: లక్ష్మణ్
- కేసీఆర్ తో రేవంత్ రాజీ పడ్డారన్న లక్ష్మణ్
- ఓటుకు నోటు కేసు కూడా ముందుకు సాగదని వ్యాఖ్య
- రేవంత్, రాహుల్ అబద్ధాలనే నమ్ముకున్నారని విమర్శ
మతపరమైన రిజర్వేషన్లకు తావు లేదని అంబేద్కర్ చెప్పారని... కానీ దానికి కాంగ్రెస్ తూట్లు పొడిచిందని లక్ష్మణ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు అబద్ధాలనే నమ్ముకున్నారని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో బీసీలకు 50 డివిజన్ లను కేటాయిస్తే... వాటిలో 31 మంది ముస్లింలు గెలిచారని... బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పారు. కేసీఆర్ తో రేవంత్ రాజీ పడ్డారని... అందుకే కాళేశ్వరం ఫైల్ ముందుకు సాగడం లేదని... ఓటుకు నోటు కేసు కూడా ముందుకు పోదని అన్నారు. ఒక్క మాదిగకు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని... కాంగ్రెస్ లో సామాజిక న్యాయం లేదని విమర్శించారు.