రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కేశవ్ మహరాజ్ రాయల్ ఎంట్రీ అదుర్స్.. వీడియో వైరల్!
- లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు కేశవ్ మహరాజ్
- గాయంతో టోర్నీకి దూరమైన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ను తీసుకున్న ఆర్ఆర్
- కొత్త ఆటగాడికి ఘనంగా స్వాగతం పలికిన రాజస్థాన్ జట్టు
అయితే, ఇప్పుడు అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్ అదే ధరకు కేశవ్ మహరాజ్‌ను తమ జట్టులోకి తీసుకుంది. గాయంతో టోర్నీకి దూరమైన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అతడిని తీసుకుంది. దాంతో ఈ దిగ్గజ స్పిన్నర్ తాజాగా ఆర్ఆర్ జట్టుతో చేరాడు. ఈ సందర్భంగా రాజస్థాన్ ఫ్రాంచైజీ కేశవ్ మహారాజ్‌కు స్వాగతం పలుకుతూ ఓ ప్రత్యేకమైన వీడియోను రూపొందించింది. ఈ వీడియోను తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. వీడియోలో పింక్ బ్లేజర్, తలకు ఎర్రటి టర్బన్, నుదుటన తిలకంతో కేశవ్ మహరాజ్ మెరిసిపోయాడనే చెప్పాలి. 'నమస్తే.. రాయల్‌గా ఉండటం మహరాజ్‌కే సాధ్యమవుతుంది..' అని కేశవ్ మహరాజ్ చెప్పడం వీడియోలో ఉంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.