అలాంటి పరిస్థితుల్లో విడిపోవడమే బెటర్: నటి రోహిణి
- నటిగా .. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణించిన రోహిణి
- గతంలో రఘువరన్ నుంచి విడిపోయిన నటి
- విడాకుల విషయంలో ఇప్పటి ఆలోచనా విధానం మారిందని వ్యాఖ్య
- పేరెంట్స్ విడాకుల వలన పిల్లలు ఎఫెక్టు అవుతారని వెల్లడి
- విడిపోవడానికి ముందు బేరీజు వేసుకోవలసింది ఇదేనని వివరణ
"ఒక కప్పు క్రింద జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు అభిప్రాయభేదాలు వస్తూనే ఉంటాయి. అప్పట్లో పిల్లల కోసం .. సమాజం కోసం .. డబ్బు కోసం జీవితంతో రాజీపడుతూ వెళ్లడం జరుగుతూ వచ్చింది. పెద్దవాళ్లు కూడా, అమ్మాయే సర్దుకుపోవాలి .. అప్పుడే సంసారం సాగుతుందని అనేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని దాటిపోయామని నేను అనుకుంటున్నాను" అన్నారు.
"విడిపోవడం వలన ఏదో అయిపోతుందని చాలామంది అనుకుంటారు .. కానీ ఏమీ కాదు. తల్లిదండ్రులు విడిపోవడం వలన పిల్లలు చాలానే ఎఫెక్ట్ అవుతారు. అయితే కలిసుండటం వలన వాళ్ల భవిష్యత్తు ఎక్కువగా డ్యామేజ్ అవుతుందా? విడిపోవడం వలన ఎక్కువ డ్యామేజ్ అవుతుందా? అనేది బేరీజు వేసుకోవాలి. దానిని బట్టే నిర్ణయాన్ని తీసుకోవాలి" అని చెప్పారు.