దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న రేవంత్, మంత్రులు
- పూజ సమయంలో కింద కూర్చున్న మల్లు భట్టి
- మల్లుకు అవమానం జరిగిందన్న ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్
ఇదే అంశంపై బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శలు గుప్పించింది. యాదాద్రి దేవాలయం సాక్షిగా దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, బహుజన బిడ్డ కొండా సురేఖను రేవంత్ రెడ్డి అండ్ కో ఘోరంగా అవమానించిందని ట్వీట్ చేసింది. వారు పైన కూర్చుని భట్టి విక్రమార్క, కొండా సురేఖను రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవమానించారని వ్యాఖ్యానించింది.