డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోదరుడు కన్నుమూత
- భట్టి విక్రమార్క సోదరుడు వెంకటేశ్వర్లు కన్నుమూత
- గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి
- ఖమ్మం జిల్లా స్నానాల లక్ష్మీపురంలో సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు
హోమియోలో ఎండీ చదివిన డాక్టర్ వెంకటేశ్వర్లు ఆయుష్ శాఖలో ప్రొఫెసర్ గా, అడిషనల్ డైరెక్టర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత వైరాలో ఉన్న తన నివాసంలో హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. హోమియో వైద్యుడిగా ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఒక సామాజిక బాధ్యతతో ఆయన ఈ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.