నా కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడు.. లలిత్ మోదీపై బౌలర్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు
- ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడాలనుకున్నానంటే ఫోన్లో బెదిరింపులు
- బెంగళూరు జట్టులోనే ఉండాలని కట్టడి చేశారని వివరణ
- తాజా ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ ఫేసర్ వెల్లడి
క్రికెట్ లో బాల్ ట్యాంపరింగ్ చాలా సాధారణమని ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు. 1990 లలోనే ట్యాంపరింగ్ మొదలైందన్నాడు. రివర్స్ స్వింగ్ ను రాబట్టేందుకు దాదాపుగా ప్రతీ ఫాస్ట్ బౌలర్ ట్యాంపరింగ్ కు పాల్పడతాడని వివరించాడు. ఈ విషయం కూడా అందరికీ తెలుసని చెప్పాడు. అయితే, ఇప్పుడు మైదానం నలుమూలలా కెమెరాలు ఉండడం, మైదానంలోని ప్రతి ఆటగాడి చిన్న కదలికను కూడా రికార్డు చేస్తుండడంతో ట్యాంపరింగ్ ఆరోపణలు పెరిగాయని ప్రవీణ్ తెలిపాడు. అందరూ చేస్తున్నా పాకిస్థాన్ ఆటగాళ్లు ఇందులో ఆరితేరారని, వాళ్లే ఎక్కువగా ట్యాంపరింగ్ కు పాల్పడతారని తాను విన్నట్లు ప్రవీణ్ చెప్పుకొచ్చాడు.