జగన్ హీరోయిజం చూసే రాజకీయాల్లోకి వచ్చా: ఎమ్మెల్యే సుధాకర్
- కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ కు ఈసారి టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం
- జగన్ తప్పుకోమంటే తప్పుకుంటానన్న సుధాకర్
- టికెట్ వస్తుందనే ఆశాభావంతోనే ఉన్నానని వ్యాఖ్య
మరోవైపు, కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ కు కూడా ఈసారి టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.... జగన్ హీరోయిజం చూసే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఆయన టికెట్ ఇస్తేనే, అదృష్టం కొద్దీ తాను ఎమ్మెల్యే అయ్యానని అన్నారు. జగన్ ఆదేశాల మేరకు శక్తివంచన లేకుండా ప్రజల కోసం కష్టపడ్డానని చెప్పారు. ప్రజల్లో తనకు అంత బాగోలేదని... అయినా, టికెట్ తనకే వస్తుందనే ఆశాభావంతో ఉన్నానని తెలిపారు. జగన్ తప్పుకో అని చెపితే, మరో ఆలోచన లేకుండా తప్పుకుంటానని అన్నారు. రాజకీయాల్లోకి ఎందరో వస్తుంటారని... పాలిటిక్స్ లో పోటీ ఉండటం సహజమేనని చెప్పారు. జగన్ తనకు ఏ బాధ్యతను అప్పగించినా పని చేస్తానని తెలిపారు.