ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రభావం కచ్చితంగా ఉంటుంది: బ్రదర్ అనిల్ కుమార్
- కాంగ్రెస్ హైకమాండ్ ఏ బాధ్యతలను అప్పగించినా షర్మిల స్వీకరిస్తారన్న అనిల్
- కాంగ్రెస్ కుటుంబంలో ఉండటమే తమకు ముఖ్యమని వ్యాఖ్య
- హైకమాండ్ ఆదేశాల మేరకు షర్మిల పూర్తి స్థాయిలో పని చేస్తారన్న అనిల్
పార్టీ హైకమాండ్ ఏ బాధ్యతలను అప్పగించినా షర్మిల స్వీకరిస్తారని... కాంగ్రెస్ కుటుంబంలో ఉండటమే తమకు ముఖ్యమని చెప్పారు. కాంగ్రెస్ లో షర్మిల చేరడం ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందా? అనే ప్రశ్నకు సమాధానంగా... ఏపీలో కచ్చితంగా షర్మిల ప్రభావం ఉంటుందని అన్నారు. మీ బావమరిది, సీఎం జగన్ కు వ్యతిరేకంగా పని చేయమని హైకమాండ్ ఆదేశిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా... అధిష్ఠానం ఆదేశాల మేరకు షర్మిల పూర్తి స్థాయిలో పని చేస్తారని చెప్పారు.