ఇక మెగాస్టార్ తోనే అనిల్ రావిపూడి సినిమా!
- బాలయ్యతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి
- మెగాస్టార్ నుంచి వచ్చిన గ్రీన్ సిగ్నల్
- వచ్చే ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ప్రాజెక్ట్
- ఈ లోగా రవితేజతో 'రాజా ది గ్రేట్' సీక్వెల్
ఇటీవలే బాలయ్యతో 'భగవంత్ కేసరి' సినిమాను తెరకెక్కించి, అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఆ తరువాత ఆయన చిరంజీవికి ఒక కథను వినిపించడం .. ఆ కథ నచ్చడంతో చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం శ్రీవశిష్ఠ సినిమా కోసం రెడీ అవుతున్న చిరంజీవి, ఆ తరువాత అనిల్ రావిపూడి సినిమా చేయనున్నారని అంటున్నారు.
ఆయితే ఈ గ్యాప్ లో రవితేజతో అనిల్ రావిపూడి ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'రాజాపై ది గ్రేట్' సినిమాకి ఇది సీక్వెల్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో అనిల్ రావిపూడి ఉన్నాడని అంటున్నారు.