రోహిత్ శర్మ మనస్తత్వం ఎలాంటిదో చెప్పిన అశ్విన్
- రోహిత్ శర్మ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడిన అశ్విన్
- జట్టులోని ప్రతి ఒక్కరిని అర్ధం చేసుకునే వ్యక్తి అని కితాబు
- నాయకత్వానికి సంబంధించి రోహిత్ శర్మ స్థాయి ఓ మెట్టు పైనే ఉంటుందని వెల్లడి
జట్టులోని ప్రతి ఆటగాడికి వ్యూహాలను, ఎత్తుగడలను బోధపర్చడం ఎలాగో రోహిత్ శర్మను చూసి తెలుసుకోవాలని అశ్విన్ పేర్కొన్నాడు. నాయకత్వానికి సంబంధించి మిగతావాళ్లకంటే రోహిత్ శర్మ చాలా ముందున్నాడని, తాను ఏం మాట్లాడతాడో అదే చేస్తాడని, తానేంటో తను ఏంటో బ్యాట్ ద్వారా చాటిచెబుతాడని వివరించాడు.