న్యూజెర్సీలో ప్రపంచ రెండో అతిపెద్ద దేవాలయం... అక్షయ్ కుమార్ స్పందన
- అమెరికాలోనే అతిపెద్ద దేవాలయం అక్షరధామం
- 2011లో ప్రారంభమైన ఆలయ పనులు, ఇటీవలే ఆలయ ప్రారంభం
- గుజరాత్ బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామి నారాయణ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం
ఈ దేవాలయ నిర్మాణ పనులు 2011లో ప్రారంభం కాగా, ఇటీవలే దీనిని ప్రారంభించారు. ఈ మందిర నిర్మాణం గుజరాత్‌కు చెందిన బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామి నారాయణ్ సంస్థ (బీఏపీఎస్) ఆధ్వర్యంలో జరిగింది. ఆలయానికి దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఆలయ నిర్మాణంలో ఉక్కు, ఇనుము ఉపయోగించలేదు. వేలాది సంవత్సరాల పాటు చెక్కుచెదరని రీతిలో దీనిని నిర్మించారు.