కేసీఆర్ కు మోదీ వచ్చినప్పుడే జ్వరం, జలుబు వస్తాయి: లక్ష్మణ్
- మోదీకి స్వాగతం పలికేందుకు కేసీఆర్ మాత్రం రాడన్న లక్ష్మణ్
- కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని వ్యాఖ్య
- మోదీ సభ విజయవంతం కావడంతో కేటీఆర్ కు పాలుపోవడం లేదని ఎద్దేవా
ప్రధాని అనే గౌరవం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని అన్నారు. తెలంగాణ మొత్తం తమ కుటుంబమే అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... దళితుడిని ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదని, దళితుడు మీ కుటుంబ సభ్యుడు కాదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అందరూ మీ కుటుంబ సభ్యులేనని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగులు, మద్దతు ధర అడిగిన రైతులు, పోడు భూముల కోసం పోరాడుతున్న గిరిజనులు మీ కుటుంబ సభ్యులు కాదా? అని ప్రశ్నించారు.