పులి ఒక అడుగు వెనక్కి వేస్తే భయపడినట్లు కాదు: చంద్రబాబు అరెస్ట్‌పై ఉండవల్లి శ్రీదేవి
- చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదన్న ఎమ్మెల్యే
- చంద్రబాబు అదరలేదని, కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారని వ్యాఖ్య
- తాత్కాలికంగా పాపం గెలిచినప్పటికీ, అంతిమ విజయం సత్యానిదేనన్న శ్రీదేవి
- ఈ కేసు నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వ్యాఖ్య
తాత్కాలికంగా పాపం గెలవవచ్చునని, కానీ అంతిమ విజయం మాత్రం సత్యానిదే అవుతుందని వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారని, కానీ ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. త్వరలోనే ఆయన బెయిల్‌పై వచ్చి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పులి ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన భయపడినట్లు కాదని గుర్తించాలన్నారు.