టిల్లు గాని కోసం రాధిక మళ్లీ వస్తోంది!
- డీజే టిల్లులో ఆకట్టుకున్న సిద్ధు, నేహాశెట్టి కెమిస్ట్రీ
- ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న టిల్లు స్క్వేర్
- హీరోయిన్‌గా నటిస్తున్న అనుపమ
అయితే, ఆ పాత్రకు లభించిన ఆదరణ దృష్ట్యా సీక్వెల్‌లో నేహా శెట్టి కోసం అతిథి పాత్రను రూపొందించినట్టు తెలుస్తోంది. సినిమాలో కొన్ని నిమిషాల పాటు రాధిక క్యారెక్టర్ ఉంటుందని, ప్రస్తుతానికి ఆ విషయాన్ని రహస్యంగా ఉంచినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే డీజే టిల్లు–రాధిక కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. కాగా, నేహా శెట్టి నటించిన ‘బెదురులంక 2012’ చిత్రంతో ఈ శుక్రవారం విడుదల కానుంది. రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల్లోనూ ఆమె హీరోయిన్ గా నటిస్తోంది.