'జైలర్' సినిమాలో బాలయ్య ఉండాల్సిందట.. ఆ సినిమా డైరెక్టర్ ఏం చెప్పారంటే..!
- హిట్ టాక్ తో దూసుకెళ్తున్న రజనీకాంత్ 'జైలర్'
- ఓ పోలీస్ పాత్ర కోసం బాలకృష్ణను అనుకున్నానన్న దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్
- అయితే ఆ పాత్రను సరిగా క్రియేట్ చేయలేకపోయానని వెల్లడి
మరోవైపు ఈ చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రంలో ఓ పాత్రకు బాలకృష్ణను తీసుకోవాలని అనుకున్నానని... అయితే కుదరలేదని చెప్పారు. ఓ పోలీసు పాత్ర కోసం బాలయ్యను అనుకున్నానని... అయితే, కథకు తగ్గట్టుగా ఆ పాత్రను క్రియేట్ చేయలేకపోయానని తెలిపారు. పాత్ర సరిగా కుదరనప్పుడు బాలయ్యను ఎంపిక చేయడం సరికాదని భావించానని చెప్పారు. అందుకే బాలయ్యను సంప్రదించలేదని తెలిపారు. భవిష్యత్తులో ఆయనతో సినిమా చేస్తానేమో అని అన్నారు. ఒకవేళ ఈ చిత్రంలో బాలయ్య నటించి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మరో రేంజ్ లో ఉండేదేమో!