ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతా: చంద్రబాబుతో భేటీ అనంతరం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
- తాను ఇబ్బందులు పడుతున్న సమయంలో చంద్రబాబు, లోకేశ్ మద్దతిచ్చారన్న ఎమ్మెల్యే
- వైసీపీ గూండాలు తనపై దాడి చేశారని ఆరోపణ
- ప్రస్తుతం తెలంగాణలో వుంటున్నట్టు వెల్లడి
ప్రస్తుతం తాను తెలంగాణలో నివసిస్తున్నానని, తనకు రక్షణపై చంద్రబాబును అడిగానని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనే అంశంపై నాలుగున్నర నెలలపాటు ఆలోచించానని, చంద్రబాబు, జగన్ పాలనలను బేరీజు వేసుకున్నానన్నారు. తాను ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతానన్నారు. ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఆర్5 జోన్‌లో ప్లాట్లు ఇవ్వవద్దని హైకోర్టు చెప్పిందన్నారు.