'భోళా శంకర్' టికెట్ రేటు పెంచాలని ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న నిర్మాత
- చిరంజీవి హీరోగా భోళాశంకర్
- ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై చిత్రం
- మెహర్ రమేశ్ దర్శకత్వం
- ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మెగా మూవీ
ఇటీవల చిరంజీవి ఓ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ మంత్రులు చిరంజీవిపై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు భోళా శంకర్ టికెట్ రేటు పెంచాలని ఏపీ ప్రభుత్వానికి నిర్మాత దరఖాస్తు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.