బీజేపీలోకి సినీ నటి జయసుధ..?
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన మాజీ ఎమ్మెల్యే
- 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జయసుధ
- గతంలోనూ బీజేపీలో చేరికపై ఊహాగానాలు
బీజేపీలో చేరేందుకు జయసుధ గతంలోనూ చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ నిర్మాతతో కలిసి బీజేపీ నేతలను కలిసినట్లు సమాచారం. పార్టీ చేరికల కమిటీతో జయసుధ చర్చలు జరిపారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే, అప్పట్లో జరిగిన ఈ చర్చల తర్వాత అటు బీజేపీ కానీ ఇటు జయసుధ కానీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. చర్చల సందర్భంగా పార్టీలో చేరే విషయంపై జయసుధ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని బీజేపీ నాయకులు గతంలో పేర్కొన్నారు. తాజాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలవడంతో జయసుధ త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.