‘టైగర్ కా హుకుం’ అంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్
- జైలర్ చిత్రంలో నటిస్తున్న సూపర్ స్టార్
- హుకుం అనే రెండో పాట రేపు విడుదల
- ఆగస్టు 10న రానున్న చిత్రం
అదే జోరులో ఈ సినిమా నుంచి రెండో పాటకు ముహూర్తం పెట్టారు. ‘హుకుం’ అనే పాటను సోమవారం విడుదల చేయనున్నట్టు ఓ ప్రోమోను వదిలారు. ఇందులో ‘ఏయ్ ఇక్కడ నేనే కింగ్. నేను చెప్పేవే రూల్స్. రూల్స్ తప్పితే ఎవర్నీ వదిలిపెట్టను. ఇది హుకుం.. టైగర్ కా హుకుం’ అంటూ రజనీకాంత్ తన దైన స్టైల్, స్వాగ్ లో చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. దాంతో, ఈ పాటపైనా అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 10వ తేదీన పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తమన్నాతో పాటు మోహన్‌లాల్, శివ రాజ్ కుమార్, జాకీష్రాఫ్, నాగబాబు, సునీల్, రమ్యకృష్ణ ఈ చిత్రంలో నటించారు.