హిట్ 2 చిత్రంలోని ఆఫీసర్ 'మ్యాక్స్' ఇకలేదు!
- తన పెంపుడు శునకం చనిపోయిందని తెలిపిన దర్శకుడు శైలేష్
- అడివి శేష్ హీరోగా నటించిన హిట్2లో కీలక పాత్ర పోషించిన శునకం
- నానితో రానున్న హిట్3
‘బరువెక్కిన హృదయంతో ఈ వార్తను మీతో షేర్ చేసుకుంటున్నా. మా ప్రియమైన మాక్స్ ఇప్పుడే చనిపోయింది. మాక్స్ పది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. క్రూరమైన జాతి అయినప్పటికీ.. నా జీవితంలో నేను కలుసుకున్న అత్యంత సున్నితమైన మనసుల్లో ఇది ఒకటి. ఆఫీసర్ మాక్స్ మేమంతా నిన్ను మిస్సవుతున్నాం. మాక్స్ లేకుండా హిట్2 అంత బాగా వచ్చేది కాదు’ అని శైలేష్ ట్వీట్ చేశారు. హిట్ కు సీక్వెల్ గా న్యాచురల్ స్టార్ నానితో హిట్3 ఉండబోతుందని శైలేష్ కొలను ఇప్పటికే ప్రకటించారు.