170వ సినిమాలో అమితాబ్ తో స్క్రీన్ ను పంచుకుంటున్న రజనీకాంత్
- టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ కొత్త ప్రాజెక్టు
- రజనీ కెరీర్ లో ఇది 170వ చిత్రం
- అంధా కానూన్, గిరఫ్తార్, హమ్ చిత్రాల తర్వాత కలిసి నటిస్తున్న రజనీ, అమితాబ్
కాగా, ఈ చిత్రంలో మరో ప్రత్యేకత ఉంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత రజనీకాంత్, అమితాబ్ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అంధా కానూన్, గిరఫ్తార్, హమ్ చిత్రాల తర్వాత మరోసారి అమితాబ్ తో కలిసి రజనీ స్క్రీన్ పంచుకోనున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు, తారాగణం డిటెయిల్స్ త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతం రజనీ 'జైలర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.