'పాపం పసివాడు' కూడా క్లాస్ వార్ గురించి తెలుసుకోవాలి: పవన్ కల్యాణ్
- రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతోందన్న సీఎం జగన్
- జగన్ వ్యాఖ్యలపై కథాకళి పేరిట జనసేన వీడియో
- చర్చలో పాల్గొన్న నాగబాబు, వేములపాటి అజయ్ కుమార్
జనసేన పార్టీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పంచుకున్న ఈ వీడియోపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. క్లాస్ వార్ అంటే ఏమిటో జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, పార్టీ అధికార ప్రతినిధి, కాన్ ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్ ఇన్చార్జి వేములపాటి అజయ్ కుమార్ చర్చా వేదిక కథాకళిలో చెప్పారని వెల్లడించారు.
'పాపం పసివాడు' కూడా క్లాస్ వార్ గురించి తెలుసుకోవాలి అని పవన్ హితవు పలికారు. ఈ మేరకు వీడియోను కూడా పంచుకున్నారు. 'పాపం పసివాడు' అంటూ జనసేన ఇప్పటికే సీఎం జగన్ పై ఓ వ్యంగ్య పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.