వసూళ్లలో తొలి రోజు నిరాశ పరిచిన సల్మాన్ కొత్త సినిమా
- రంజాన్ కానుకగా విడుదలైన కిసీ కా భాయ్ కిసి కీ జాన్
- కీలక పాత్ర పోషించిన విక్టరీ వెంకటేశ్
- ప్రపంచ వ్యాప్తంగా 5700 స్ర్కీన్లలో ప్రదర్శన
- నేటి వసూళ్లు రూ. 15 కోట్ల వరకు వుండచ్చని అంచనా
ప్రపంచవ్యాప్తంగా 5700 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమాకు పేలవమైన ఓపెనింగ్స్ వచ్చాయి. సల్మాన్ గత సినిమాలకంటే అన్ని భాషల్లో అతి తక్కువ ఆక్యుపెన్సీ లభించింది. తొలి రోజు నెట్ కలెక్షన్స్ రూ. 15 కోట్ల వరకు వుండచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో రంజాన్ సందర్భంగా విడుదలైన సల్మాన్ చిత్రాలు తొలి రోజు కనీసం 20 కోట్లపైనే రాబట్టాయి.