‘శాకుంతలం’ కోసం పొట్ట తగ్గించుకున్న సమంత
- శకుంతల పాత్రకు అనుగుణంగా ఆకృతి లేదన్న డైరెక్టర్ గుణశేఖర్
- సాధనతో పొట్ట భాగంలో కండను కరిగించుకున్న సమంత
- మొదటి నుంచీ ఈ పాత్రకు సమంతనే అనుకున్నట్టు వెల్లడి
రాజు దుష్యంతుడు, శకుంతల మధ్య ప్రేమే ఈ సినిమా కథనం. దేవ్ మోహన్ ఇందులో దుష్యంత్ పాత్రను పోషించాడు. కథనాయికగా శకుంతల పాత్ర విషయంలో సమంత తప్పించి మరో చాయిస్ తమకు లేదని గుణశేఖర్ తెలిపారు. ‘‘శామ్ మొదట కథ గురించి చెప్పినప్పుడు నో అనలేదు. అనారోగ్యం కారణంగా కొంత వ్యవధి కావాలని అడిగింది. సినిమా ఎలా ఉంటుందనే దానికి కొంత మెటీరియల్ ను ఆమెకు చూపించాను.
తన శరీర ఆకృతి విషయంలో కొంత సాధన చేయాలని ఆమెను కోరాను. పొట్ట భాగంలో కండరాలు ఆమె పాత్రకు అనుకూలంగా సున్నితంగా లేవని చెప్పాను’’ అని గుణశేఖర్ వివరించారు. ఈ పాత్రకు సంబంధించి మొదటి రోజు నుంచి కూడా సమంతే తమ దృష్టిలో ఉందని, మరో నటిని అనుకోలేదని స్పష్టం చేశారు. మొదటి రోజు ఈ సినిమా రూ.5 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల కథనం.