'అఖండ' సీక్వెల్ ను ఆ రోజునే మొదలుపెడతారట!
- సంచలన విజయాన్ని సాధించిన 'అఖండ'
- సీక్వెల్ కోసం జరుగుతున్న సన్నాహాలు
- జూన్ 10వ తేదీన లాంచ్ అంటూ టాక్
- ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా బాలయ్య
కథాకథనాలు .. యాక్షన్ సీన్స్ తో పాటు ఈ సినిమాకి సంగీతం ప్రధానమైన బలంగా నిలిచింది. తమన్ స్వరపరిచిన పాటలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ ఉందనే విషయాన్ని సక్సెస్ ఈవెంటులోనే బోయపాటి చెప్పాడు.
జూన్ 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు. ఆ రోజున ఆ సినిమా సీక్వెల్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ లోగా అధికారిక ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు.