టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం
- ఎమ్మెల్యేలకు ధర్మారెడ్డి గౌరవం ఇవ్వడం లేదన్న అన్నా రాంబాబు
- ఒంటెద్దు పోకడలకు పోతున్నారని విమర్శ
- ధర్మారెడ్డిపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని వ్యాఖ్య
టీటీడీ ఈవోగా కొనసాగాలని ధర్మారెడ్డి ఎలా తపన పడుతున్నారో... స్వామిని దర్శించుకోవాలని తాము కూడా అంతే తపన పడుతున్నామని చెప్పారు. తిరుమల కొండకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఒకే నిబంధనను అమలు చేస్తే... తాము కూడా సామాన్య భక్తుడిలా స్వామిని దర్శనం చేసుకుంటామని తెలిపారు. టీటీడీ అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. ఈ ఉదయం అన్నా రాంబాబు తన కుటుంబంతో కలిసి నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ధర్మారెడ్డిపై విమర్శలు గుప్పించారు. ధర్మారెడ్డిపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.