ఇదేం వెబ్ సిరీస్ .. ఇంత దారుణమా?: సీనియర్ నటుడు శివకృష్ణ
- వెబ్ సిరీస్ లపై స్పందించిన శివకృష్ణ
- ఆ వెబ్ సిరీస్ చూడలేకపోయానని వ్యాఖ్య
- కచ్చితంగా వాటికి సెన్సార్ ఉండాలన్న శివకృష్ణ
- పిల్లలు పాడైపోతున్నారని ఆవేదన
"సినిమాల్లో బూతు ఉంటే, థియేటర్స్ కి వచ్చిన వారికి మాత్రమే ఆ సంగతి తెలుస్తుంది. వెబ్ సిరీస్ లు అలా కాదే. ఇలాంటివి చూడకుండా పిల్లలను నియంత్రించడం కష్టమైపోతోంది. ఈ మధ్య కాలంలో చాలామంది పాడైపోవడానికి కారణం ఓటీటీ సినిమాల వల్లనే .. వెబ్ సిరీస్ ల వల్లనే. అందువలన కచ్చితంగా వాటికి సెన్సార్ ఉండాల్సిందే" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"నిన్న నేను ఆ వెబ్ సిరీస్ చూడలేకపోయాను .. సడెన్ గా అలాంటి ఒక సీన్ వస్తుందని మనం ఊహించలేం కదా. అంత దారుణాన్ని ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. మనం ఎక్కడికి వెళ్లిపోతున్నాం అనిపించింది. దేశం ఆర్ధికంగా పతనమైనా తిరిగి కోలుకుంటుంది. కానీ సంస్కృతి పరంగా పతనమైతే ఆ దేశాన్ని కాపాడడం కష్టం" అని చెప్పుకొచ్చారు.