ఆమె కోసమే పేపర్ లీక్.. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్‌లో కొత్త కోణం
- యువతి వలపు వలలో చిక్కుకున్న ఉద్యోగి
- ఆమె అడగడంతో టౌన్ ప్లానింగ్ పరీక్ష పేపర్ లీక్
- అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు
- నిందితుడిని అదుపులోకి తీసుకున్నపోలీసులు
పేపర్ లీకేజీ ఆరోపణలతో దర్యాప్తు చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు టీఎస్ పీఎస్ సీ ఆఫీసుకు వచ్చిపోయే వారి వివరాలను పరిశీలించారు. రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలలో వెతికారు. దీంతో కొంతకాలంగా ఓ యువతి తరచుగా ఆఫీసుకు వస్తోందని గుర్తించారు. ఆమె తరచూ ప్రవీణ్ ను కలుస్తోందని తేలింది.
టీఎస్ పీఎస్ సీ సెక్రెటరీ పీఏగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ తో సన్నిహితంగా మెలుగుతూ టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ పేపర్ ఇవ్వాలని అడిగింది. ఆమె కోసం ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్టు గుర్తించారు. నిందితుడు ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.