తెలుగు వెబ్ సిరీస్ కి సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్?
- యూత్ లో సాయిపల్లవికి విపరీతమైన క్రేజ్
- 'విరాట పర్వం' తరువాత కనిపించని సాయిపల్లవి
- రెండు తమిళ సినిమాలతో బిజీ
- శేఖర్ కమ్ముల శిష్యుడితో వెబ్ సిరీస్ చేసే ఛాన్స్
సాయిపల్లవి చేతిలో సినిమాలు లేవంటే ఆమెకి అవకాశాలు రావడం లేదు అని కాదు .. ఆమెకి నచ్చిన కథలు రాలేదు అనే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తనకి నచ్చితేనే తప్ప ఆమె ఏ సినిమాను ఒప్పుకోదు. అలాంటి సాయిపల్లవి పేరు 'విరాటపర్వం' తరువాత ఏ తెలుగు ప్రాజెక్టులోను వినిపించడం లేదు. తమిళంలో మాత్రం ఆమె ధనుశ్ సరసన .. శివ కార్తికేయన్ జోడీగా చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఆమె ఒక తెలుగు వెబ్ సిరీస్ చేయనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. శేఖర్ కమ్ముల శిష్యుడు 'నెట్ ఫ్లిక్స్' కోసం ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేశాడట. నాయిక ప్రధానమైన ఈ కథకు సాయిపల్లవి అయితే కరెక్టుగా ఉంటుందని భావించి ఆమెను సంప్రదించినట్టు సమాచారం. సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని అంటున్నారు.