మహాసేన రాజేష్ గురించి జనసైనికులు ఎవరూ తప్పుగా మాట్లాడకండి: నాగబాబు
- టీడీపీలో చేరనున్న మహాసేన రాజేష్
- ఈ నెల 16న ముహూర్తం
- పెద్దాపురంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు సన్నాహాలు
- ఇటీవల జనసేనలో చేరతాడంటూ ప్రచారం
ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు స్పందించారు. మహాసేన రాజేష్ గురించి జనసైనికులు ఎవరూ తప్పుగా మాట్లాడకండి అంటూ ట్వీట్ చేశారు. అతను ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాడనేది అతని ఇష్టం... అది తన ప్రజాస్వామ్య హక్కు అని నాగబాబు స్పష్టం చేశారు. అతడి నిర్ణయం ఎలాంటిదైనా గౌరవించాలని, అతడికి శుభాకాంక్షలు తెలపాలని సూచించారు.