ఈసారి మేనేజర్ల వంతు.. వేటుకు సిద్ధమైన జుకర్‌బర్గ్!
- ఇటీవలే 11 వేల మందిని తొలగించిన మెటా
- మేనేజర్ల వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి
- మధ్యస్థాయి మేనేజర్లకు త్వరలోనే పింక్ స్లిప్‌లు!
మేనేజర్లు, వారిని నియంత్రించేందుకు మరికొంతమంది మేనేజర్లు, ఆ మేనేజర్లను మేనేజ్ చేసేందుకు ఇంకొంతమంది మేనేజర్లు.. ఇలా ఇన్ని స్థాయుల్లో మేనేజ్‌మెంట్ వ్యవస్థ అవసరమని తాను అనుకోవడం లేదని జుకర్‌బర్గ్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే వారికి పింక్ స్లిప్‌లు ఖాయమని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా, మెటా ఇటీవల ఏకంగా 11 వేల మంది ఉద్యోగులపై వేటేసింది. ఇప్పుడు మేనేజర్లను ఇంటికి పంపాలని యోచిస్తోంది.