సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'
- బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వీరసింహారెడ్డి
- ఈ నెల 12న విడుదల
- U/A సర్టిఫికెట్ కేటాయించిన సెన్సార్ బోర్డు
- దుమ్మురేపుతున్న ట్రైలర్
- ఇటీవలే ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర పోషించింది. తమన్ సంగీతం అందించాడు. ఇటీవల ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో వేడుకగా జరిగింది.
అటు, వీరసింహారెడ్డి ట్రైలర్ ఆన్ లైన్ లో దూసుకుపోతోంది. బాలకృష్ణ చెప్పిన డైలాగులు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి... సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.