ఎన్ని సినిమాలు చేసినా ఇంకా కసి తీరలేదు: 'వీరసింహారెడ్డి' ఫంక్షన్లో బాలయ్య
- నేడు ఒంగోలులో 'వీరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఈ రోజు నుంచే సంక్రాంతి పండుగ మొదలైందన్న బాలయ్య
- స్పెషల్ గెస్టుగా అర్హత బి. గోపాల్ కే ఉందంటూ ప్రశంసలు
- శ్రుతి హాసన్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అంటూ కితాబు
- హనీ రోజ్ పాత్ర గురించి చెప్పనన్న బాలయ్య
"నటీనటుల టాలెంటును వెలికితీసే సత్తా ఉన్న ఒంగోలు గిత్త .. గోపీచంద్ మలినేని. నిజంగానే ఆయన డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక 'భైరవద్వీపం. .. 'ఆదిత్య 369' .. 'అఖండ' సినిమాల మాదిరిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఎన్ని సినిమాలు చేసినా ఇంకా కసి తీరలేదు. విభిన్నమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాను. ఎప్పటికప్పుడు ఇంకా ఏదైనా కొత్తగా చేయాలనే తపన ఉండాలనేది నాన్నగారి నుంచి నేర్చుకున్నాను" అని చెప్పారు.
"ఇక శ్రుతి హాసన్ లక్కీ హీరోయిన్ అనడం కంటే .. సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనడం కరెక్ట్. ఎందుకంటే తను చాలా కష్టపడి పైకొచ్చింది. తను మంచి డాన్సర్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. హనీ రోజ్ కి తెలుగులో ఇదే ఫస్టు మూవీ. తనని చూడగానే భలే అమ్మాయిని పట్టారే అనిపించింది. తన పాత్రను గురించి నేను చెప్పను .. సినిమా చూసిన తరువాత మీరే చెప్పుకుంటారు" అంటూ ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఈ వేదికపై శ్రుతి హాసన్ కూడా స్టెప్పులు వేయడం కొసమెరుపు.
.