రివర్స్ ట్రెండ్.. ఓటీటీలో వచ్చిన తర్వాత థియేటర్లలోకి వెంకటేశ్ సినిమా రిలీజ్
- ఈ నెల 13న వెంకటేశ్ పుట్టిన రోజు
- ఈ సందర్భంగా నారప్ప సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్న చిత్ర బృందం
- ఓటీటీలోకి వచ్చాక తిరిగి థియేటర్లలోకి వస్తున్న తొలి చిత్రం ఇదే
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గతేడాది కరోనా లాక్ డౌన్ కారణంగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఇక ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాలని ఆశించిన అభిమానుల కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది. వెంకీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 13న ‘నారప్ప’ని థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. కేవలం ఒక్క రోజు మాత్రమే ఈ చిత్రం థియేటర్లలో చూడొచ్చని సురేష్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. దాంతో, వెంకీ అభిమానులందరికీ ఇది శుభవార్త అనొచ్చు. ఓటీటీలో విడుదలైన సినిమాని థియేటర్స్‌లో విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. దాంతో, వెంకటేశ్ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ప్రియమణి హీరోయిన్‌గా నటించింది.