ఎరువుల ఫ్యాక్టరీని మోదీ ప్రారంభిస్తే.. కేసీఆర్ కు కడుపు మంట ఎందుకు?: కె.లక్ష్మణ్
- మోదీ పర్యటనను ఎదుర్కొంటామని కేసీఆర్ అంటున్నారన్న లక్ష్మణ్
- రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శ
- కమ్యూనిస్టులు కేసీఆర్ కనుసన్నల్లో పని చేయడం దురదృష్టకరమని వ్యాఖ్య
రెండు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర నిధులతో మోదీ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని లక్ష్మణ్ తెలిపారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని ప్రారంభిస్తారని చెప్పారు. ఎరువుల కర్మాగారాన్ని మోదీ ప్రారంభిస్తే కేసీఆర్ కు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. కేసీఆర్ కు మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయగా మారిందని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్... ఊరికో ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు.