ఏపీ రోడ్లపై కేంద్ర మంత్రి విమర్శలు.. సిగ్గుచేటు అన్న చంద్రబాబు
- రోడ్ల దుస్థితి చూడండి అంటూ వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి మురళీధరన్
- 20 కి.మీ. ప్రయాణానికి గంటకు పైగా పట్టిందని విమర్శ
- సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి.. ప్రజలు రోడ్డు దాటలేకపోతున్నారన్న బాబు
తన ట్వీట్ లో ఏపీ ప్రభుత్వంపై మురళీధరన్ విమర్శలు గుప్పించారు. 'అనకాపల్లిలోని రోడ్ల దుస్థితిని చూడండి. వైయస్ జగన్ అభివృద్ధి మోడల్ అంటే ఇదేనా? ఈ రోడ్లపై ప్రయాణించడం ఒక శిక్షలాంటిది. ప్రజల ప్రాథమిక అవసరాలను కూడా జగన్ పట్టించుకోవడం లేదు. అనకాపల్లి నుంచి అచ్యుతాపురంకు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంటకు పైగా సమయం పట్టింది. షేమ్' అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసిన చంద్రబాబు... వైసీపీ ప్రభుత్వానికి ఇది సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రోడ్ల మరమ్మతులపై ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ... ప్రజలు మాత్రం రోడ్డు దాటలేకపోతున్నారని విమర్శించారు.