రజనీకాంత్ పాదాలకు నమస్కరించిన మాధవన్
- మాధవన్ ను సత్కరించిన రజనీకాంత్
- రాకెటరీ సినిమా సక్సెస్ నేపథ్యంలో భేటీ
- రజనీకి ధన్యవాదాలు చెబుతూ మాధవన్ ట్వీట్
ఈ ఫొటోలను మాధవన్ స్వయంగా ట్విట్టర్ పేజీలో షేర్ చేశాడు. ‘‘నంబి నారాయణన్ సమక్షంలో పరిశ్రమ అంటే కనిపించే ఒకే ఒక్కడు, దిగ్గజ నటుడి నుంచి ఆశీర్వచనాలు తీసుకోవడం.. నిజంగా ఈ క్షణం శాశ్వతంగా గుర్తుండిపోతుంది. రాకెటరీ గురించి మీ మంచి మాటలకు, అభిమానానికి ధన్యవాదాలు రజనీకాంత్ సర్. మీ ప్రోత్సాహం మమ్మల్ని పూర్తిగా పునరుజ్జీవింప చేస్తుంది. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం’’అంటూ మాధవన్ ట్వీట్ చేశాడు. నంబి నారాయణన్ ఇస్రో మాజీ శాస్త్రవేత్త.