'పుష్ప-2'లో తాను లేనంటూ క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నటుడు
- బన్నీ, సుక్కు కాంబోలో పుష్ప బ్లాక్ బస్టర్
- తెరకెక్కుతున్న సెకండ్ పార్ట్
- మనోజ్ బాజ్ పాయి కూడా ఉన్నాడంటూ ప్రచారం
- ఒట్టి పుకార్లేనని ఖండించిన నటుడు
దీనిపై మనోజ్ బాజ్ పేయి స్పష్టతనిచ్చారు. ఇవన్నీ ఒట్టి పుకార్లేనని ఖండించారు. వీటిలో నిజంలేదని అన్నారు. అసలు, ఇలాంటి వార్తలు ఎక్కడ్నించి పుట్టుకొస్తున్నాయి? అంటూ తిరిగి ప్రశ్నించారు.
మనోజ్ బాజ్ పేయికి దక్షిణాది చిత్ర పరిశ్రమ కొత్తకాదు. ఆయన గతంలో పలు తెలుగు చిత్రాల్లో నటించారు. ఇటీవల మాట్లాడుతూ, సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లా, రూ.500 కోట్లా, రూ.300 కోట్లా అనేది తనకు ముఖ్యం కాదని అన్నారు. ఇప్పుడందరూ బాక్సాఫీసు వద్ద ఎంత వసూలు చేసిందన్నదే లెక్కలోకి తీసుకుంటున్నారని వివరించారు. తాను ఈ బాక్సాఫీసు ట్రెండ్ కు ఎప్పటికీ వ్యతిరేకమని తెలిపారు.
మనోజ్ బాజ్ పేయి ఇటీవల 'ఫ్యామిలీ మేన్' అనే వెబ్ సిరీస్ లో నటించగా, ఓటీటీ వేదికపై అది సూపర్ హిట్టయింది. 'ఫ్యామిలీ మేన్-2'లో టాలీవుడ్ బ్యూటీ సమంత కూడా నటించింది. ఆమె నటించిన కొన్ని బోల్డ్ సన్నివేశాలు ప్రకంపనలు రేపాయి.